ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించి చరిత్ర సృష్టించిన సత్నామ్, సల్మాన్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: న్యూఢిల్లీ
జపాన్లోని నాగరగావా ఇంటర్నేషనల్ రెగట్టా కోర్సు వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల డబుల్ స్కల్స్ విభాగంలో భారత్ తరఫున సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్ జోడీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. నిర్ణీత లక్ష్యాన్ని 6:13.25 నిమిషాల్లో పూర్తి చేసి కాంస్య పతకం సాధించింది. భారత్ తరఫున ఈ విభాగంలో పతకం సాధించడం ఇదే మొదటిసారి. ఈ చారిత్రక విజయం దేశానికి గర్వకారణంగా నిలిచిందని క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేశారు.