రాయలసీమను గ్లోబల్ ప్రూట్ బౌల్‌గా తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు నాయుడు
రిపోర్టర్: నరేష్
స్థలం: మదనపల్లె
రాయలసీమ ఉద్యాన పంటల హబ్‌ను గ్లోబల్ ప్రూట్ బౌల్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అక్టోబరు 2న అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేసి, ఈ హబ్‌కు శ్రీకారం చుట్టనున్నట్లు సీఎంఓ వెల్లడించింది. అత్యాధునిక సాంకేతికత, పరిశోధనలతో ఉద్యాన రంగంలో సరికొత్త విప్లవం తీసుకువచ్చి, రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.