విద్యార్థులకు అలర్ట్: ఏపీలో ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
ఏపీలో ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ను ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి పి. రంజిత్ బాషా విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నట్లు ఆయన తెలిపారు. రెగ్యులర్, బ్యాక్లాగ్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జనరల్, ఒకేషనల్ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ను కూడా అధికారులు వెల్లడించారు.