రాష్ట్రంలో కూటమి సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయి: సోమిరెడ్డి
రిపోర్టర్: అశోక్
స్థలం: తిరుపతి జిల్లా
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతాయని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తోటపల్లి గూడూరు మండలం విలుకానిపల్లిలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు అందిస్తూ పేద ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని వెల్లడించారు.