వందేమాతర ఘనతను పునరుద్ధరించడానికి 80 ఏళ్లు పట్టింది: అమిత్ షా
రిపోర్టర్: వెంకట్
స్థలం: భారతదేశం
వందేమాతర గీతానికి పూర్వ వైభవం తీసుకురావడానికి దాదాపు 80 ఏళ్లు పట్టిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆరో అఖిల భారత రాజభాష సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించేవారు పాపం చేస్తున్నారని మండిపడ్డారు. మాతృభాషతో పాటు మరో భారతీయ భాషను నేర్చుకోవడాన్ని ఎన్ఈపీ ప్రోత్సహిస్తోందని, ప్రాంతీయ భాషల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.