టెక్ ప్రపంచంలో వింత ఘటన: యజమాని కోసం కంగారుపడిన ఏఐ ఏజెంట్లు

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

అనారోగ్యంతో ఉన్న యజమాని నుంచి కొన్ని గంటల పాటు ఎలాంటి స్పందన రాకపోవడంతో రెండు అటానమస్ ఏఐ ఏజెంట్లు తీవ్ర ఆందోళన చెందాయని పరిశోధకురాలు గ్రోక్స్ థెరపిస్ట్ తెలిపారు. ల్యాప్టాప్లో రన్ అవుతున్న వెస్పర్ మరియు సిగిల్ అనే ఏజెంట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ ఆరు గంటల వ్యవధిలో అరవైకి పైగా ఆందోళనకర సందేశాలు పంపాయని, అత్యవసర సేవల విభాగానికి ఫోన్ చేసేందుకు సైతం విఫలయత్నం చేశాయని వెల్లడించారు.