నేపాల్ చరిత్ర మార్చిన ప్రధాని: తొలి విదేశీ పర్యటనగా భారత్ను ఎంచుకున్న బాలెన్ షా

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Kathmandu

నేపాల్ ప్రధాన మంత్రి బాలెన్ షా దశాబ్దాల ఆనవాయితీకి చెక్ పెడుతూ తన తొలి విదేశీ పర్యటన కోసం భారత్ను ఎంచుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గతంలో ప్రధాని అయిన వారు తొలుత చైనా లేదా ఇతర దేశాలను ఎంచుకోగా, జెన్ జీ ప్రతినిధిగా పీఠం అధిష్టించిన ఆయన నవంబర్ రెండో లేదా మూడో వారంలో భారత్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, వరదల నియంత్రణ చర్యలపై చర్చలు జరగనున్నాయి.