దసరా కానుకగా రామ్ చరణ్, సుకుమార్ సినిమా లాంఛింగ్!
రిపోర్టర్: సురేష్
స్థలం: తెలంగాణ
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్సి17 పూజా కార్యక్రమాలు దసరా పండుగ సందర్భంగా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అడవి నేపథ్యంతో రానున్న ఈ చిత్రంలో చరణ్ సరికొత్త మాస్ లుక్‌లో కనిపించనున్నారు. నేషనల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.