ఆదిలాబాద్‌లో దళిత యువకుడి ఆత్మహత్య కలకలం: రిమ్స్ డైరెక్టర్ ఛాంబర్ ఎదుట ధర్నా
రిపోర్టర్: రాము
స్థలం: ఆదిలాబాద్
ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రి వైద్య సిబ్బంది, పోలీసుల వేధింపుల కారణంగానే కామ్లే రాహుల్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ దళిత సంఘాల నాయకులు గురువారం రిమ్స్ డైరెక్టర్ ఛాంబర్ ఎదుట తీవ్ర ఆందోళన చేపట్టారు. తేలు కుట్టిందని ఆసుపత్రికి వెళ్లిన యువకుడిని మద్యం తాగాడంటూ పోలీసులు స్టేషన్‌కు తరలించి అవమానించడంతోనే అతను బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి తగినన్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.