రాజ్యాంగబద్ధ సంస్థలను చులకన చేయడం తగదు: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
రిపోర్టర్: కిరణ్
స్థలం: కృష్ణా జిల్లా
మన ప్రజాస్వామ్య వ్యవస్థలను మనమే చులకన చేసుకోవడం తగదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు హితవు పలికారు. కృష్ణా జిల్లా ఆత్కూరులో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సంఘంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు అసంబద్ధమని ఆయన స్పష్టం చేశారు. సీఈసీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా డిమాండ్లు సరికావన్నారు. ఓట్ల తొలగింపు అనేది కేవలం అపోహ మాత్రమేనని, రాజ్యాంగ సంస్థలను రాజకీయ వివాదాల్లోకి లాగడం దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.