వైరా ప్రభుత్వ బాలికల ఐటీఐలో ఈ నెల 26న స్పాట్ కౌన్సెలింగ్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వైరా
వైరా మండలం ముస్లిమడుగులోని ప్రభుత్వ బాలికల పారిశ్రామిక కళాశాలలో ఈ నెల 26న తక్షణ ప్రవేశాల కోసం ప్రత్యేక స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డి. మాధవరావు తెలిపారు. ఐదు నుంచి తొమ్మిదో తరగతి వరకు అలాగే ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో పలు ఖాళీ సీట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థినులు సెప్టెంబర్ 26వ తేదీన ఉదయం సరైన ఒరిజినల్ ధ్రువపత్రాలతో నేరుగా కళాశాలకు హాజరుకావాలని సూచించారు.