భూ భారతి సర్వర్ డౌన్ తో రిజిస్ట్రేషన్ల నిలిపివేత

రిపోర్టర్: విజయ్ స్థలం: బీబీనగర్

భూ భారతి పోర్టల్ సర్వర్ అకస్మాత్తుగా డౌన్ కావడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయినట్లు కొనుగోలుదారులు, విక్రయదారులు వెల్లడించారు. బీబీనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్న ప్రజలు ఉదయం నుంచి గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. సర్వర్ పని చేయక పోవడంతో సమయం, డబ్బు వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సాంకేతిక సమస్యను పరిష్కరించి పెండింగ్ రిజిస్ట్రేషన్లను పూర్తి చేయాలని అధికారులు, ప్రభుత్వాన్ని బాధితులు తీవ్రంగా కోరుతున్నారు.