విద్యుత్ షాక్తో గొర్రెల కాపరితో పాటు పదమూడు గొర్రెలు మృతి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని లేమార్తి కాలనీలో జరిగిన ఘోర విద్యుత్ ప్రమాదంలో బంగారయ్య అనే గొర్రెల కాపరితో పాటు పదమూడు గొర్రెలు మృతి చెందారని దువ్వాడ పోలీసులు తెలిపారు. గొర్రెలను మేపుతుండగా ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు వెల్లడించారు. మృతుడు విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం కిస్సన్నపేట గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు.