ట్రాఫిక్ భద్రత కోసం ప్రత్యేక బ్యూరో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు, రైల్వే భద్రతతో పాటు సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ కోసం టీజీ-టీమార్స్ (TG-TMARS) పేరిట ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త విభాగానికి ఏడీజీపీ లేదా ఐజీ స్థాయి సీనియర్ ఐపీఎస్ అధికారి డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. జాతీయ రహదారులపై నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు ప్రమాదాల నివారణకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించనున్నారు.