ఎలక్ట్రానిక్ కాంటాలతో రిమోట్ మోసాలకు పాల్పడుతున్న మాయగాళ్లు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లాలో పత్తి, పెసర విక్రయాల సమయంలో మాయగాళ్లు ఎలక్ట్రానిక్ కాంటాలకు రిమోట్లు అమర్చి రైతులను మోసగిస్తున్నారని జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి విజయ్కుమార్ తెలిపారు. దళారులు వాహనాల్లో తిరుగుతూ చిప్లు అమర్చిన కాంటాలతో కర్షకుల కష్టాన్ని దోచుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంట కొనుగోళ్లు ప్రారంభమైన నేపథ్యంలో మార్కెట్లలోని తూకం యంత్రాలను పరిశీలించి స్టాంపింగ్ వేస్తున్నామని, జిన్నింగ్ మిల్లుల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నామని తూనికల శాఖ అధికారులు స్పష్టం చేశారు.