జగన్కు డీఎస్సీ, ఏపీపీఎస్సీ తేడా కూడా తెలియదా: మంత్రి లోకేష్
రిపోర్టర్: హరి
స్థలం: ఆంధ్రప్రదేశ్
డీఎస్సీ నియామకాలపై మాజీ సీఎం జగన్ విమర్శలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. జగన్ హయాంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ సున్నా అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులు పారదర్శకంగా భర్తీ చేశామని స్పష్టం చేశారు. ప్రతి ఏటా 3 వేల పోస్టులను భర్తీ చేస్తామని, త్వరలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని లోకేష్ వెల్లడించారు.