వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమన్న ఎమ్మెల్సీ తాతా మధు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఖమ్మం

వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని ఎమ్మెల్సీ, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధుసూదన్ అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో ఐలమ్మ 131వ జయంతి నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. నిజాం, దొరల దౌర్జన్యాలు, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఐలమ్మ జయంతికి అధికారిక గుర్తింపు కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. నేటితరం యువత ఆమె ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.