జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తెలంగాణ ఈగల్ ఫోర్స్
రిపోర్టర్: వెంకట్
స్థలం: New Delhi
తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మరియు ఈగల్ ఫోర్స్ జాతీయ స్థాయిలో అత్యున్నత గుర్తింపును దక్కించుకున్నాయి. న్యూఢిల్లీలో జరిగిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధిపతుల సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఈ పురస్కారాన్ని అందుకున్నారు. డ్రగ్స్ నిరోధక చర్యల్లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఏడు ప్రమాణాల్లో రాష్ట్రం ఎనభై శాతానికి పైగా మార్కులు సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచింది.