రష్యా ఉక్రెయిన్ యుద్ధ తీవ్రత పెరుగుతుందంటూ హెచ్చరికలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: వరల్డ్
రష్యాలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి నేపథ్యంలో రష్యా నాటో ఘర్షణ పెరుగుతుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా స్టేట్ డూమా ఎన్నికల తర్వాత మాస్కో ఉక్రెయిన్పై యుద్ధాన్ని తీవ్రతరం చేయవచ్చని పశ్చిమ దేశాల నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పోలాండ్ నేత డొనాల్డ్ టస్క్ నాటో తూర్పు సరిహద్దులపై రష్యా డ్రోన్ మరియు క్షిపణి దాడి హెచ్చరికలు చేశారు. మరోవైపు మాస్కోపై భారీ ఉక్రెయిన్ డ్రోన్ దాడి జరగడంతో విమానాశ్రయాలు నిలిచిపోయి చమురు రిఫైనరీ దెబ్బతింది.