పంతంగిలో పారిశుద్ధ్య సిబ్బంది కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల శిబిరం
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామపంచాయతీలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య సిబ్బందికి ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. స్థానిక పల్లె దవాఖానలో బుధవారం వైద్య సిబ్బంది రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించి తగు సూచనలు చేశారు. గ్రామ సర్పంచ్ శ్రీలత సుందర్, కార్యదర్శి పద్మజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సిబ్బందిని అప్రమత్తం చేశారు.