రామన్నచెరువు ఆక్రమణపై అధికారపార్టీ నేతల కబ్జాపర్వంపై తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: కృష్ణ స్థలం: నెల్లూరు

అల్లూరు రామన్నచెరువును అధికారపార్టీ నేతలు ఆక్రమించి తారుప్లాంట్, నర్సరీ ఏర్పాటు చేస్తున్నారని జలవనరుల శాఖ ఏఈ సుధీర్ తెలిపారు. అల్లూరు, దగదర్తి మండలాల మధ్య ఉన్న ఈ చెరువును వందల ఎకరాల్లో కబ్జా చేశారని, వరదనీటి కాలువను పూడ్చివేయడంతో పది పంచాయతీల తాగు, సాగునీటికి తీవ్ర ముప్పు వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖ కబ్జాను నిర్ధారిస్తే పోలీసుల సహాయంతో తక్షణమే చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.