నిశ్చితార్థం రద్దు చేసుకున్న క్రికెటర్ పృథ్వీ షా
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: New Delhi
భారతీయ క్రికెటర్ పృథ్వీ షా, ఆయన కాబోయే భార్య ఆకృతి అగర్వాల్ తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. భవిష్యత్తు లక్ష్యాలు, పరిస్థితులు భిన్నంగా ఉండటంతో ఇరు కుటుంబాల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆకృతి అగర్వాల్ వెల్లడించారు. గతేడాది మార్చి 8న వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ కష్ట సమయంలో తమ గోప్యతను గౌరవించాలని ఆమె కోరారు.