తణుకులో ఘనంగా మట్టి వినాయక ప్రతిమల తయారీ పోటీలు

రిపోర్టర్: సునీల్ స్థలం: పశ్చిమగోదావరి

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాంటిస్సోరి పాఠశాలలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు మట్టి వినాయక ప్రతిమల తయారీ పోటీలు ఏర్పాటు చేశారు. సాంప్రదాయ వేషధారణలో విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. హైందవ సంస్కృతిలో పండగలు ప్రకృతిని ఆరాధించడమేనని పాఠశాల డైరెక్టర్ జ్ఞానమంజరి తెలిపారు.