రాజమహేంద్రవరంలో కొత్త బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు

రిపోర్టర్: గోపి స్థలం: తూర్పు గోదావరి

రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం 32 కిలోమీటర్ల మేర కొత్త బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని తొర్రేడు నుంచి పొట్టిలంక వరకు రూ.300 కోట్లతో ఈ రోడ్డు నిర్మించనున్నారు. భారీ వాహనాలను నగరంలోకి రాకుండా మళ్లించడం ద్వారా ప్రజలకు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని అధికారులు తెలిపారు.