సాంకేతిక లోపంతో మౌలాలి వద్ద నిలిచిపోయిన శాతవాహన ఎక్స్ ప్రెస్

రిపోర్టర్: నరేష్ స్థలం: సికింద్రాబాద్

సికింద్రాబాద్ నుంచి విజయవాడ బయలుదేరిన శాతవాహన ఎక్స్ ప్రెస్ రైలు మౌలాలి వద్ద సాంకేతిక లోపంతో నిలిచిపోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇంజిన్ పై ప్యాంటో గ్రాఫ్ విరిగిపోవడంతో ఒక్కసారిగా రైలు ఆగిపోయిందని, దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని పేర్కొన్నారు. ఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది వెంటనే మరమ్మతులు చేపట్టి రైలును గమ్యస్థానానికి పంపించారని, ప్రస్తుతం ఈ రైలు గంటకు పైగా ఆలస్యంగా నడుస్తోందని వెల్లడించారు.