కుప్పం రైల్వే స్టేషన్‌లో కొత్త రైళ్ల హాల్ట్‌లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: మహేష్ స్థలం: కుప్పం

కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తూ కుప్పం రైల్వే స్టేషన్‌లో దాదర్–పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్, వాస్కోడగామ–వేళంగిణి ఎక్స్‌ప్రెస్ రైళ్ల అదనపు హాల్ట్‌లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించి పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా కుప్పం ప్రాంతాన్ని భవిష్యత్తులో ఆర్థిక, పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన సీఎం, పొగురుపల్లి సమీపంలోని డ్రై పోర్టును రైల్వే కనెక్టివిటీతో అనుసంధానిస్తామని వెల్లడించారు.