అల్లూరి మన్యంలో డిజిటల్ విప్లవం: గిరిజన పల్లెల్లో సెల్ టవర్లు
రిపోర్టర్: మహేష్
స్థలం: అల్లూరి సీతారామరాజు
అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో డిజిటల్ విప్లవం వచ్చింది. ఏజెన్సీ ప్రాంతాల్లో సమాచార అంధకారాన్ని తొలగించేందుకు ప్రభుత్వం 1584 సెల్ టవర్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పటికే 1267 టవర్లు అందుబాటులోకి రాగా, మిగిలిన వాటి నిర్మాణం తుది దశకు చేరింది. దశాబ్దాలుగా సిగ్నల్స్ లేక ఇబ్బందులు పడిన గిరిజనులకు ఇప్పుడు హైస్పీడ్ ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్క్ సేవలు అందుబాటులోకి రావడంతో హర్షం వ్యక్తమవుతోంది.