కావలిలో భారీగా గంజాయి పట్టివేత ముగ్గురు నిందితుల అరెస్టు
రిపోర్టర్: గోపి
స్థలం: కావలి
ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి తమిళనాడుకు తరలిస్తున్న తొంబై రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కావలి గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గుడి రాజేశ్వరరావు తెలిపారు. కావలి పట్టణంలోని పోలీసు స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జాతీయ రహదారిపై నిఘా పెట్టి తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారని, వెంటనే వెంబడించి పట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.