హైదరాబాద్ లో అత్యాధునిక ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో అత్యాధునిక హంగులతో కూడిన ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. పర్యావరణ హితమైన ఈ సర్వీసుల ద్వారా తొలివిడతగా రెండు ప్రత్యేక బస్సులను నడుపుతుండగా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్ తో పాటు చారిత్రక ప్రదేశాల గుండా ఇవి ప్రయాణించనున్నాయి. కింది భాగం ఏసీగా, పైభాగం ఓపెన్ టాప్ గా ఉండే ఈ బస్సుల్లో జీపీఎస్, సీసీటీవీ కెమెరాలు మరియు ప్రత్యేక గైడ్ సదుపాయాలను కల్పించారు.