నా సినిమాలను స్క్రీన్‌పై ఎప్పుడూ చూడలేను: ప్రీతి జింటా
రిపోర్టర్: అశోక్
స్థలం: Mumbai
బాలీవుడ్ నటి ప్రీతి జింటా లాంగ్ గ్యాప్ తర్వాత ‘వైబ్’ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ ప్రతి కొత్త పాత్రను చేసేటప్పుడు సందేహం కలుగుతుందని, నా సినిమాలను స్క్రీన్‌పై ఎప్పుడూ చూడలేనని తెలిపారు. థియేటర్‌లో కూర్చోవడం ఇబ్బందిగా ఉంటుందని, ఈ సీన్ ఇంకాస్త మెరుగ్గా చేసి ఉండాల్సిందనే ఆలోచనే వస్తుందని మనసులోని మాటను పంచుకున్నారు.