భక్తిశ్రద్ధలతో పంతంగిలో ఘనంగా గణనాథుని ప్రత్యేక పూజలు

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ మండలంలోని పంతంగి గ్రామం అయోధ్యనగర్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొమ్మిదో వార్డు సభ్యురాలు గాడుదుల శ్వేత ప్రవీణ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో గణనాథునికి ఘనంగా అభిషేకాలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయగా, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.