లాభాల వాటా పెంపు: సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు న్యాయం చేయాలి

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు గతేడాది చెల్లించిన లాభాల వాటాను ఈ ఏడాది పెంచి ఇవ్వాలని విప్లవ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కార్మికులకు అదనపు ఆర్థిక భద్రత కల్పించాలని కోరాయి. ఉత్పత్తి రంగంలో వీరి శ్రమ కీలకమని, సంస్థ లాభాల్లో తగిన వాటా దక్కేలా యాజమాన్యం ప్రత్యేక చొరవ చూపాలని స్పష్టం చేశాయి.