శంకరపట్నం కరవు మండలం ప్రకటన: రహదారిపై బైఠాయించి భాజపా శ్రేణుల నిరసన

రిపోర్టర్: కిరణ్ స్థలం: శంకరపట్నం

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలాన్ని తక్షణమే కరవు మండలంగా ప్రకటించాలని కోరుతూ భాజపా మండల అధ్యక్షుడు అనిల్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు గురువారం ఆందోళన చేపట్టాయి. మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు చేసిన పంటలు పూర్తిగా ఎండిపోయాయని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ సురేఖకు వినతిపత్రం అందజేశారు.