2027 వన్డే ప్రపంచకప్‌పై క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ
రిపోర్టర్: సునీల్
స్థలం: మహారాష్ట్ర
టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడే అంశంపై స్పందించారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో అభిమానులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, అక్టోబర్ నాటికి ఇంకా చాలా సమయం ఉందని, అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్న రోహిత్ భవిష్యత్తుపై ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.