నిధుల కేటాయింపుల్లో వివక్షపై మండిపడుతూ సభను బహిష్కరించిన సర్పంచులు

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ వెంకటరమణ ఆధ్వర్యంలో రసాభాసగా సాగింది. తమ గ్రామాలకు కనీస నిధులు, మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని మండిపడుతూ ప్రతిపక్ష సర్పంచులు అధికారులను తీవ్రస్థాయిలో నిలదీశారు. నిరసనగా వారు సమావేశం నుండి మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. అనంతరం అధికార పార్టీ సర్పంచులు, ప్యాక్స్ చైర్మన్ కౌడగాని రాజేష్ కన్నా మరియు వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని కేవలం మొక్కుబడిగా ముగించడం గమనార్హం. నిధుల విడుదలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని గ్రామప్రతినిధులు డిమాండ్ చేశారు.