గాడే సాయికృష్ణ కస్టడీ మృతిపై సుప్రీంకోర్టు తీవ్ర విచారణ
రిపోర్టర్: రాము
స్థలం: విజయవాడ
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన గాడే సాయికృష్ణ కస్టడీ మృతి, అదృశ్యం కేసును సుప్రీంకోర్టు తన చేతుల్లోకి తీసుకుంది. ఎఫ్‌ఐఆర్‌లో జాప్యం, సీసీటీవీ టేజ్ తొలగింపుపై ఏపీ పోలీసులను త్రిసభ్య ధర్మాసనం నిలదీసింది. వైయస్ఆర్సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి పిటిషన్ మేరకు విచారణ చేపట్టిన కోర్టు, తదుపరి విచారణను అక్టోబర్ 12కి వాయిదా వేసింది. ఈ కేసులో సీబీఐని ప్రతివాదిగా చేర్చడంతో పాటు ఏపీ హైకోర్టులో కొనసాగుతున్న విచారణను నిలిపివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.