హెల్త్‌కార్డుల వైద్యంపై ఎస్టీయూ నేతల తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: గోపి స్థలం: ఎన్టీఆర్ జిల్లా

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డుల ద్వారా మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పి ప్రభుత్వం చేతులు ఎత్తేయడం సరికాదని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.రఘునాథరెడ్డి, లంకపల్లి సాయిశ్రీనివాస్ మండిపడ్డారు. విజయవాడలో జరిగిన కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. ప్రీమియం వసూలు చేస్తూ నగదు రహిత వైద్యం అందించకపోవడం దారుణమని, బోధనేతర భారాలు తగ్గించాలని డిమాండ్ చేశారు.