ఎల్నినో ముప్పు: ప్రతి గ్రామంలో జల సంరక్షణ పనులు చేపట్టాలని గుత్తా పిలుపు
రిపోర్టర్: విజయ్
స్థలం: నకిరేకల్
ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రతి గ్రామంలో జల సంరక్షణ పనులు చేపట్టాలని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. నకిరేకల్ లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితుల వల్ల తాగునీరు, ఉపాధి విషయంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రబీ సీజన్ లో రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసేలా చైతన్యం చేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.