తిరుమలలో భక్తుల భారీ రద్దీతో నిండిపోయిన క్యూకాంప్లెక్స్లు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తిరుమల
తిరుమలలో శ్రీవారి దర్శనార్థం భక్తులు భారీగా తరలివచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోవడంతో భక్తులు వెలుపల క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు పదిహేను గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఒక్కరోజే అరవై ఆరు వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా, నాలుగు కోట్ల రూపాయలకు పైగా హుండీ ఆదాయం సమకూరిందని టీటీడీ స్పష్టం చేసింది.