అమరావతిలో క్వాంటం వ్యాలీ ట్విన్ టవర్స్ పనులకు మంత్రి నారాయణ భూమిపూజ
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
అమరావతి రాజధానిలో అత్యాధునిక క్వాంటం వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి మంత్రి పి. నారాయణ మంగళవారం శంకుస్థాపన చేశారని పట్టణాఫీవృద్ధి శాఖ తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాజధాని ప్రాంతంలో సుమారు ఇరవై ఐదు వేల మంది యువతకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఉద్దండరాయునిపాలెంలో యాభై ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ కేంద్రం ద్వారా రాష్ట్రంలో సాంకేతిక విప్లవం రానుందని వెల్లడించారు.