రాజాపేటలో గణనాథునికి ఘనంగా లక్ష పుష్పార్చన మరియు పూజలు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలం రఘునాథపురం శ్రీవాసవి ఆర్యవైశ్య సంఘ భవనంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ ఆర్యవైశ్యులు ఉత్సవాల్లో భాగంగా గణనాథునికి లక్ష పుష్పార్చన, సామూహిక కుంకుమార్చన భక్తిశ్రద్ధలతో జరిపారు. సంఘం అధ్యక్షులు ఉప్పల సిద్ధి లింగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపను పొందారు.