భర్తను హత్య చేసి డ్రమ్ములో దాచిన కేసులో భార్య దోషి
రిపోర్టర్: హరి
స్థలం: మేరఠ్
భర్తను చంపి శవాన్ని డ్రమ్ములో దాచిపెట్టిన సంచలన కేసులో మేరఠ్ కోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది అని ప్రాసిక్యూషన్ వర్గాలు తెలిపాయి. మృతుడు సౌరభ్ రాజ్పుత్ భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ ఈ హత్యకు పాల్పడినట్లు జిల్లా కోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్ మిశ్రా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దోషులుగా తేల్చారు. గతేడాది మార్చిలో జరిగిన ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నిందితులకు త్వరలో శిక్ష ఖరారు కానుంది.