గోవాలో బీజేపీని గద్దె దించేందుకు ఆప్, జీఎఫ్పీ కూటమి
రిపోర్టర్: సతీష్
స్థలం: గోవా
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాత్మక అడుగు వేశారు. గోవా ఫార్వర్డ్ పార్టీతో జతకట్టి 'గోవా ఫస్ట్ కూటమి'ని ఏర్పాటు చేశారు. బీజేపీయేతర ఓట్లు చీలకుండా నిరోధించడమే లక్ష్యంగా ఈ పొత్తు కుదిరింది. స్థానిక సమస్యల పరిష్కారం, ప్రత్యామ్నాయ పాలనే ప్రధాన ఎజెండాగా ఈ కూటమి ముందుకు సాగనుంది.