మోత్కూర్ మండలం దాచారం కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి నియామకం
రిపోర్టర్: Srinivasulu akavaram
స్థలం: మోత్కూరు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం దాచారం గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా ఎడమ శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. శుక్రవారం మోత్కూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాచకొండ బాలరాజు గౌడ్ ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తూ, కార్యకర్తలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని శ్రీనివాస్ రెడ్డికి సూచించారు.