ఆస్కార్ రేసులో నాగాలాండ్ కొన్యక్ భాషా చిత్రం అంఘ్
రిపోర్టర్: మహేష్
స్థలం: నాగాలాండ్
భారతీయ సినిమా సత్తాను చాటుతూ 1960ల నాగాలాండ్ నేపథ్యంలో పూర్తిగా కొన్యక్ భాషలో 16mm ఫిల్మ్‌పై తెరకెక్కిన అంఘ్ చిత్రం 2027 అకాడమీ అవార్డుల ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిమ్ కేటగిరీ పరిశీలనకు అర్హత సాధించింది. మారుమూల కొండ గ్రామంలో మారుతున్న జీవన విధానం, సంస్కృతి నేపథ్యంలో సాగే ఈ చిత్రం అంతర్జాతీయ వేదికపై అరుదైన మైలురాయిని చేరుకుంది.