ఎన్నికల అధికారి తొలగింపునకు డిమాండ్: ఖమ్మంలో యువత భారీ ప్రదర్శన

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

అక్టోబర్ 8న ఖమ్మంలో జరిగే భారీ ప్రదర్శనలో యువత పాల్గొనాలని AIYF జిల్లా కార్యదర్శి చింతల రమేష్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్‌ను తొలగించి, అరెస్ట్ చేయాలని, ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి రూ.4,000, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం దశలవారీ పోరాటాలు చేపడతామన్నారు. జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.