'భూముల లెక్కలు తేల్చాలి': రేవంత్ సర్కార్‌ను బీజేపీ తెలంగాణ నిలదీత

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Telangana

రాష్ట్రంలో ప్రభుత్వ, అటవీ, అసైన్డ్, వక్ఫ్ మరియు దేవాదాయ భూములతో కలిపి సుమారు 98 లక్షల ఎకరాల భూముల లెక్కలు తేలాలని బీజేపీ తెలంగాణ డిమాండ్ చేసింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని కోరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, భూబకాసురుల నుంచి అక్రమ మిగులు భూములను స్వాధీనం చేసుకోవాలని బీజేపీ తెలంగాణ తీవ్రస్థాయిలో సవాల్ విసిరింది.