కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ కర్మాగార విస్తరణకు భూకేటాయింపు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: వైయస్సార్ కడప
రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తూ వైయస్సార్ కడప జిల్లా మైలవరం మండలం చిన్న కొమ్మర్ల గ్రామంలో దాల్మియా సిమెంట్ కర్మాగార విస్తరణకు ప్రభుత్వం రెండు వందల యాభై ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్. యువరాజ్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని, వచ్చే ఏడాది నవంబర్ నాటికి ట్రయల్ ప్రొడక్షన్ ప్రారంభం కానుందని ప్రభుత్వం పేర్కొంది.