ఏపీలో ఉత్తమ ఉపాధ్యాయుల జాబితా విడుదల, 103 మందికి అవార్డులు
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఏపీలో 2026 ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాల విద్యాశాఖ నుంచి 79 మంది, ఇంటర్ బోర్డు నుంచి 24 మందిని అవార్డులకు ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయి కమిటీ సిఫార్సుల మేరకు ఉపాధ్యాయులు, హెచ్ఎంలు, లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లను ప్రభుత్వం గుర్తించింది. శనివారం గురుపూజోత్సవం సందర్భంగా వీరికి పురస్కారాలను అందజేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారికంగా జీవో జారీ చేసింది.