విజయ్ పోలికలతో వినాయక విగ్రహాలు: తమిళనాడులో తీవ్ర దుమారం

రిపోర్టర్: కృష్ణ స్థలం: తమిళనాడు

చెన్నైలోని కొరుక్కుపేటలో టీవీకే అధినేత విజయ్ పోలికలతో ఏర్పాటు చేసిన గణేశ విగ్రహాలపై తమిళనాడు రాజకీయాల్లో వివాదం చెలరేగింది. దైవ స్వరూపాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతూ ఆధ్యాత్మిక భావనలను కించపరుస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మండిపడ్డారు. ఈ వివాదాస్పద విగ్రహాలను వెంటనే తొలగించి, నిర్వాహకులను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.